
సినిమాలు

ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళ, తెలుగు చిత్రసీమల్లో భారతీరాజా తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
గ్రామీణ జీవనం, ప్రేమ, మానవ సంబంధాలను హృదయానికి హత్తుకునేలా తెరపై ఆవిష్కరించడంలో భారతీరాజా ప్రత్యేక ముద్ర వేశారని ఆయన అన్నారు. తెలుగులో తెరకెక్కించిన ‘సీతాకోకచిలుక’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందని గుర్తు చేశారు. అలాగే ‘ఆరాధన’, ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ వంటి చిత్రాల ద్వారా విభిన్న కథలను అందించి ప్రేక్షకులను అలరించారని కొనియాడారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!