

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సలార్ 2’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై మొదటి భాగం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కథలో కొన్ని మార్పులు చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం చిత్రీకరణ, విడుదల ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సినిమాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ చిత్రం విడుదలైన తర్వాత కొంత విరామం తీసుకుని ‘సలార్ 2’ కథపై మళ్లీ పనిచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సిద్ధం చేసిన స్క్రిప్ట్‌కు కొన్ని మార్పులు, చేర్పులు చేసి మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సినిమా తదుపరి పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. దీంతో ‘సలార్ 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మరికొంత కాలం నిరీక్షించాల్సి రావచ్చనే చర్చ సాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!