

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనకు సంబంధించిన అశ్లీల, లైంగిక కంటెంట్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నకిలీ వార్తలు, ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ పోస్టులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా చూపించే కంటెంట్ కూడా ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇలాంటి కంటెంట్ తన పరువుకు భంగం కలిగించడంతో పాటు వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గానికి కంగనా రనౌత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వికాస్ మహాజన్ ప్రతివాదులకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని కోర్టు తెలిపినట్లు సమాచారం. ఇదే విచారణ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల కేసును కూడా కోర్టు ప్రస్తావించింది. అనుమతి లేకుండా తన వ్యక్తిత్వాన్ని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని విజయ్ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్ తదితరులు కూడా వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. వీరిలో పలువురికి హైకోర్టులు మధ్యంతర రక్షణ కల్పించాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!