

నటి సమంత జీవితంలో మరో ప్రత్యేకమైన వేడుక చోటుచేసుకుంది. ఆమెకు కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ‘మాతృ శిశు మంగళ ఆశీర్వాదం’ నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను రాజ్ సోదరి శీతల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, పెద్దమ్మలు, పిన్నమ్మలు ఒకచోట చేరి సమంతతో పాటు పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించినట్లు తెలిపారు. కుటుంబమంతా కలిసి నిర్వహించిన ఈ వేడుక ప్రేమానురాగాలతో ఎంతో ప్రత్యేకంగా సాగిందని పేర్కొన్నారు.
తమ కుటుంబంలో పూజలు, భజనలు నిత్యజీవితంలో భాగమని శీతల్ గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి బంధువులంతా ఒకచోట చేరి పూజలు, వేడుకలు చేసుకునేవారని, తమ కోసం పెద్దమ్మలు, పిన్నమ్మలు ఎంతో దూరం నుంచి వచ్చేవారని తెలిపారు. ఇప్పుడు అదే ఆప్యాయత, అనురాగాలు సమంతకు, ఆమెకు పుట్టబోయే బిడ్డకు కూడా అందుతున్నాయని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ వేడుకలో శ్రీ సూక్తం పఠనం, గాయత్రీ దేవి హోమం నిర్వహించడంతో పాటు 21 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించారు. శోభా రాజు సమంత కోసం ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించినట్లు కూడా శీతల్ వెల్లడించారు. “బుజ్జాయి.. నువ్వు ఈ లోకంలోకి రాకముందే ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు” అంటూ పుట్టబోయే బిడ్డను ఉద్దేశించి ఆమె భావోద్వేగంగా రాశారు. సమంతకు సుఖ ప్రసవం జరగాలని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!