5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

Writer: Chandrika 10:34 AM, 5 అక్టోబర్, 2026
ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన ఏఐ డీప్‌ఫేక్‌ ఘటనలపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ఘటనగా చూడకుండా.. భవిష్యత్తులో సినీ పరిశ్రమ ఎదుర్కొనే ప్రమాదాలకు హెచ్చరికగా భావించాలని అన్నారు. డీప్‌ఫేక్‌లపై రామ్‌ పోతినేని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన విష్ణు.. ఆన్‌లైన్‌ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న ఆయన సూచనపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని, అయితే దాన్ని అడ్డుపెట్టుకుని అజ్ఞాతంగా ఇతరులను వేధించడం, వారి ఫొటోలు లేదా వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేయడం ఎవరికీ హక్కు కాదని స్పష్టం చేశారు. వీడియో తొలగించడం లేదా ఫిర్యాదు చేయడం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌, MAAతో పాటు పరిశ్రమలోని అన్ని వర్గాలు కలిసి ఏఐ డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్‌ దుష్ప్రచారాలను ఎదుర్కొనేందుకు శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

ఇక సినిమాలు, నటులు, దర్శకులను లక్ష్యంగా చేసుకుని విడుదలకు ముందే ఉద్దేశపూర్వకంగా నెగెటివ్‌ ప్రచారం చేయడంపైనా మంచు విష్ణు స్పందించారు. విమర్శలు, రివ్యూలు, ట్రోలింగ్‌ సినిమా ప్రపంచంలో సహజమేనని.. అయితే ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం రాకముందే దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించడం మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ది ప్యారడైజ్‌ చిత్ర బృందం కూడా ఇలాంటి ప్రచారాల నుంచి రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఒక సినిమా విజయం లేదా వైఫల్యం మొత్తం టాలీవుడ్‌ పరిశ్రమను నిర్వచించదని, పరిశ్రమ అందరిదని పేర్కొన్నారు. MAA అధ్యక్షుడిగా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నానని, నటుల ఫొటోలను దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించే ఖాతాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ఆన్‌లైన్‌ అకౌంట్ల వివరాలను MAA సేకరిస్తోందని తెలిపారు. “ప్రతి శుక్రవారం పోటీ పడొచ్చు.. కానీ మిగిలిన వారమంతా ఒకరినొకరు నాశనం చేసుకునేందుకు ప్రయత్నించకూడదు. సినిమాను గెలవనివ్వండి” అని విష్ణు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?

డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ...

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ...

ట్యాగ్లు
మంచు విష్ణుMAA అధ్యక్షుడుఏఐ డీప్‌ఫేక్‌ఏఐ డీప్‌ఫేక్‌ వీడియోలుతెలుగు సినిమాటాలీవుడ్‌మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌రామ్‌ పోతినేనిసినీ పరిశ్రమఆన్‌లైన్‌ నెగెటివిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ
రాజకీయాలు

యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..
జనరల్

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం
జనరల్

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..
జనరల్

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు
సినిమాలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..
సినిమాలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!