

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' పార్ట్-1 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దీంతో ఈ సినిమా విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కొంత స్పష్టత వచ్చినట్లయింది. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు 'డ్రాగన్' పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న 'గాడ్ ఆఫ్ వార్' సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీంతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో ప్రాజెక్టు ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. ఇలా ముగ్గురు అగ్ర దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ తన కాల్షీట్లను ఎలా కేటాయిస్తారు? ఏ సినిమా ఎప్పటికి పూర్తవుతుంది? వాటి విడుదల తేదీలు ఎప్పుడు ఖరారవుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!