

హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’పై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు కురిపించారు. సినిమా బృందంతో కలిసి జామ్ పార్టీ వేడుకలో పాల్గొన్న ఆయన, నితిన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పటివరకు ప్రేమకథలు, రొమాంటిక్ పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందిన నితిన్, ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని నాని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ఆయనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నాని సమర్పణలో, ఆయన సోదరి దీప్తి గంటా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో నాని స్వయంగా చురుగ్గా పాల్గొంటూ చిత్ర బృందానికి మద్దతుగా నిలుస్తున్నారు. ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!