

గత కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెడుతున్నారు. ‘గురువాయూర్ అరంగేట్టం’ అనే పాన్ ఇండియా చిత్రంలో ఆమెకు అవకాశం దక్కింది. ఈ విషయాన్ని నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా వెల్లడించారు. సినిమా దర్శకుడు రాజీవ్ కృష్ణ షేర్ చేసిన పోస్ట్‌ను ఆమె రీషేర్ చేస్తూ తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందని, గురువాయూరప్పన్ భక్తుడిగా ఈ కథకు ప్రాణం పోయడం తన అదృష్టమని రాజీవ్ కృష్ణ పేర్కొన్నారు.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రముఖ మలయాళ నటుడు, నిర్మాత ఉన్ని ముకుందన్ తన సొంత నిర్మాణ సంస్థ ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మహా గణపతి మూవీస్, ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ సమర్పణలో ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. నిర్మాత సురేష్ బాబు ఆర్, రచయిత వినోద్ గురువాయూర్‌తో పాటు చిత్ర బృందం, సాంకేతిక నిపుణులకు దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు. గురువాయూర్ ఆలయ నేపథ్యంగా ప్రేమ, భక్తి అంశాల కలయికతో రూపొందనున్న ఈ రొమాంటిక్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!