

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 20, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా, వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. “అంకితభావం, నిబద్ధతతో పనిచేసే బృందం నుంచి వస్తున్న ప్రత్యేకమైన సినిమా ఇది. అల్లు అరవింద్ గారు, దుల్కర్, శ్రుతి హాసన్, స్వప్న సినిమా సంస్థతో పాటు చిత్ర బృందం మొత్తానికి నా శుభాకాంక్షలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, స్వాసిక, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రుహానీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ విషెస్‌తో సినిమాపై మరింత హైప్ పెరగగా, ఇతర చిత్రాల పోటీ మధ్య బాక్సాఫీస్ వద్ద ‘ఆకాశంలో ఒక తార’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!