
రాజకీయాలు

సూపర్‌స్టార్ రజినీకాంత్ వచ్చే ఏడాది హిమాలయాలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి తిరిగొచ్చిన ఆయన విమానాశ్రయంలో మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మళ్లీ హిమాలయాలకు ఎప్పుడు వెళ్తారని విలేకరులు ప్రశ్నించగా.. వచ్చే ఏడాది వెళ్తానని సమాధానమిచ్చారు. దీంతో ఆయన అభిమానుల్లో మరోసారి హిమాలయాల పర్యటనపై ఆసక్తి నెలకొంది.
అనంతరం తన తదుపరి చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ గురించి కూడా రజినీకాంత్ స్పందించారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు. ‘ఓం’ సినిమా ఎలా ఉందని మీడియా ప్రతినిధులు అడగ్గా.. బాగుందని క్లుప్తంగా సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!