
సినిమాలు

సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన 'రావు బహదూర్' చిత్రం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.3.9 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ వసూళ్లు చిత్రబృందానికి మంచి ప్రారంభాన్ని అందించాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఓపెనింగ్స్ సత్యదేవ్‌తో పాటు దర్శకుడు వెంకటేష్ మహా కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రారంభ వసూళ్లుగా నిలిచాయని సమాచారం. ప్రస్తుతం సినిమా వీకెండ్‌లో ఎలా రాణిస్తుందనే అంశంపై ట్రేడ్ వర్గాలు దృష్టి పెట్టాయి. స్మరన్ సాయి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు, చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ సంయుక్తంగా నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!