

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి నటించిన సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మైసా’లో నటిస్తోంది. రావీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గోండ్ తెగకు చెందిన యువతిగా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే, తాజాగా పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకలకు రష్మిక హాజరైంది. ఈ సందర్భంగా సాయిబాబా బోధనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని వెల్లడించింది. తన అత్తమామల ద్వారానే ఆయన బోధనల గురించి తెలుసుకున్నానని తెలిపింది. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ చిన్నతనంలో పుట్టపర్తిలో చదువుకున్నారని గుర్తుచేసుకుంది. ‘నా వైపు ఒక్క అడుగు వేస్తే.. నీ వైపు వంద అడుగులు వేస్తాను’ అనే స్వామివారి మాటలు తనను ఆకట్టుకున్నాయని పేర్కొంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ తన బెస్ట్ ఫ్రెండ్, జీవిత భాగస్వామి అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!