

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ముఖ్యంగా రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించే సన్నివేశాలు వచ్చినప్పుడు అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ‘మల్లెపూల పల్లకి’ పాట ప్రదర్శితమైన సమయంలో కొందరు అభిమానులు థియేటర్ స్క్రీన్‌లకు హారతులు ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అభిమానుల్లో కొందరు స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా పాటలు, రవితేజ సన్నివేశాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలు చెబుతున్నాయి. దీంతో ‘ఇరుముడి’ విడుదల సందర్భంగా థియేటర్లలో నెలకొన్న సందడి సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. రవితేజ అభిమానుల సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!