

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సినీ మ్యాగజైన్ వెరైటీ రూపొందించిన ప్రపంచంలోని అత్యుత్తమ 100 మంది నటుల జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ఈ గుర్తింపు అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా ప్రత్యేకత సాధించారు. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ 92వ స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పేరున్న నటుల సరసన ఆయనకు స్థానం దక్కడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ జాబితాలో సిల్వెస్టర్ స్టాలోన్ 99వ స్థానంలో, ఎడ్డీ మర్ఫీ 96వ స్థానంలో ఉన్నారు. ఆస్కార్ విజేతలు జోక్విన్ ఫీనిక్స్, ఎమ్మా స్టోన్, ఫిలిప్ సేమౌర్ హాఫ్‌మన్‌ల కంటే షారుఖ్ ముందుండటం మరో విశేషం. బాజీగర్, డర్ చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలతో ఆకట్టుకున్న ఆయన, ఆ తర్వాత దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, దేవదాస్ వంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. అభిమానులు ఆయనను కింగ్ ఖాన్‌గా పిలుస్తారని మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మార్లిన్ మన్రో మొదటి స్థానంలో, హంఫ్రీ బోగార్ట్ రెండో స్థానంలో, చార్లీ చాప్లిన్ మూడో స్థానంలో నిలిచారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!