

ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తన కొత్త చిత్రం ‘బెయిల్’ ప్రమోషన్లలో భాగంగా కర్ణాటకలోని చిత్రదుర్గలో ఆయన పర్యటించారు. బసవేశ్వర థియేటర్ వద్దకు చేరుకున్న శివ రాజ్‌కుమార్ అభిమానుల మధ్య నుంచి థియేటర్‌లోకి వెళ్తుండగా, ఆయనకు అత్యంత సమీపంలో ఓ బాణసంచా ఒక్కసారిగా పేలింది. దీంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి, నిప్పురవ్వల నుంచి రక్షించుకునేందుకు చేతులతో ముఖం, తలను కప్పుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది శివ రాజ్‌కుమార్‌కు రక్షణగా నిలిచారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తేరుకున్న శివ రాజ్‌కుమార్ ప్రమోషన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో థియేటర్ వద్ద భద్రతా ఏర్పాట్లపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ‘జైలర్ 2’ సహా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!