30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

Writer: Pooja 04:03 PM, 30 ఆగస్టు, 2026
అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌, సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ మధ్య కొనసాగుతున్న వివాదంలో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. తామిద్దరం ఇప్పటివరకు కలవలేదని, ‘3 ఇడియట్స్‌’లోని ఫున్సుఖ్‌ వాంగ్డు పాత్రకు వాంగ్‌చుక్‌ ప్రేరణ కాదని అమీర్‌ ఖాన్‌ ఇటీవల పేర్కొన్నారు. దీనిపై సోనమ్‌ వాంగ్‌చుక్‌ తాజాగా స్పందిస్తూ.. తాను అమీర్‌ను గతంలో ఓ అవార్డు కార్యక్రమంలో కలిశానని, ఇద్దరూ చాలాసేపు పలు విషయాలు, ఆలోచనలపై చర్చించుకున్నామని తెలిపారు. అమీర్‌ ఆ సమయంలో ‘గజినీ’ గెటప్‌లో ఉండటంతో, ఆ పాత్రలోని తాత్కాలిక మతిమరుపు వచ్చినట్లుగా తమ భేటీని మర్చిపోయి ఉండవచ్చంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

‘3 ఇడియట్స్‌’లో అమీర్‌ ఖాన్‌ పోషించిన ఫున్సుఖ్‌ వాంగ్డు పాత్ర లడఖ్‌కు చెందిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిజ జీవితంతో పోలికలు ఉన్నాయనే ప్రచారం చాలాకాలంగా ఉంది. అయితే ఈ సినిమా రూపొందుతున్న సమయంలో తన గురించి అమీర్‌ ఖాన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీకి తెలియదని అమీర్‌ చెప్పడంతో వివాదం మొదలైంది. అనంతరం 2008లో జరిగిన ఓ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో వాంగ్‌చుక్‌ ప్రసంగిస్తుండగా, అమీర్‌ ఖాన్‌ ప్రేక్షకుల్లో కూర్చొని ఆయన మాటలను శ్రద్ధగా వింటున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్‌ మాట్లాడుతూ.. ‘3 ఇడియట్స్‌ నా జీవితకథ అని నేను చెప్పడం లేదు. అయితే మన ఆలోచనలు, సంభాషణలు ఇతరులపై ప్రభావం చూపవచ్చు. నేను అమీర్‌తో చర్చించిన విషయాలు ఆయన తన రచయితలు, బృందంతో పంచుకుని ఉండవచ్చు. ఆ ప్రభావంతో సినిమాలో మార్పులు వచ్చి ఉండవచ్చు’ అని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ట్యాగ్లు
అమీర్ ఖాన్సోనమ్ వాంగ్‌చుక్3 ఇడియట్స్గజినీబాలీవుడ్ వివాదంఫున్సుఖ్ వాంగ్డు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం
గాసిప్స్

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌
సినిమాలు

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ
షోస్

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం
జనరల్

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌
జనరల్

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌
క్రీడలు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?
జనరల్

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి
జనరల్

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!