

నందమూరి కళ్యాణ్ రామ్ నటుడిగా, నిర్మాతగా విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం మీడియాకు దూరంగా ఉంచుతారు. 2006లో పెద్దలు కుదిర్చిన వివాహం ద్వారా స్వాతిని పెళ్లి చేసుకున్నారు. స్వాతి విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొంతకాలం వైద్యురాలిగా పనిచేసినట్లు కథనం పేర్కొంది. వివాహం తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వైద్య వృత్తికి విరామం ఇచ్చిన ఆమె, అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కుమార్తె పేరు మీద వీఎఫ్ఎక్స్ సంస్థను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
కళ్యాణ్ రామ్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న బింబిసార చిత్రానికి సంబంధించిన మెజారిటీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులను స్వాతి సంస్థ నిర్వహించినట్లు కథనం వెల్లడించింది. ఈ పనులను స్వాతి స్వయంగా పర్యవేక్షించారని పేర్కొంది. ఈ దంపతులకు శౌర్య రామ అనే కుమారుడు, తారక అద్వైత అనే కుమార్తె ఉన్నారు. శౌర్య ప్రస్తుతం అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరి యూనివర్సిటీలో ఫైనాన్స్ చదువుతున్నట్లు సమాచారం. మరోవైపు కళ్యాణ్ రామ్ నటుడిగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!