

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ సినిమాతో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఆయన తొలిసారి మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి రామ్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ప్రీ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌పై “ది స్టోరీ ఆఫ్ ఎ లొన్ వుల్ఫ్” అనే ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ పోస్టర్‌లో భారీ నిర్మాణం మధ్య మెట్లపై వెనుకవైపు తిరిగి నిల్చున్న రామ్ కనిపిస్తున్నారు. నల్లటి దుస్తులు, పొట్టిగా కత్తిరించిన V ఆకారపు హెయిర్ స్టైల్, తల వెనుక భాగంలో ఉన్న ప్రత్యేకమైన టాటూ ఆయన లుక్‌కు మరింత రగ్డ్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని కనిపించడం పాత్రపై మరింత ఉత్కంఠను పెంచుతోంది. త్వరలోనే సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు రామ్ రచయితగానూ వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా, సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!