

నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత ప్రస్తుతం సినిమాలు, టీవీ కార్యక్రమాలతో పాటు డిజిటల్ కంటెంట్‌లోనూ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన తల్లి సురేఖా వాణి కెరీర్, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేఖా వాణి సినిమాలకు దూరమయ్యారన్న ప్రచారంలో నిజం లేదని, వాస్తవానికి ఆమెకు అవకాశాలు తగ్గాయని సుప్రీత తెలిపారు. కొత్త నటీనటులకు ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో పాత తరం కళాకారులకు ఆఫర్లు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.
తమ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా స్థిరపడిందన్న ప్రచారం కూడా నిజం కాదని సుప్రీత స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము అద్దె ఇంట్లోనే ఉంటున్నామని, గతంలో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన ఇంటిని అప్పులు తీర్చేందుకు విక్రయించామని చెప్పారు. తమ వద్ద ఉన్న కార్లు కూడా ఈఎంఐలపైనే ఉన్నాయని, పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి కొనుగోలు చేసే స్థోమత లేదన్నారు. తనకు వచ్చే ఆదాయాన్ని తల్లికి ఇచ్చేస్తానని, పొదుపులు కూడా పెద్దగా లేవని తెలిపారు. హైదరాబాద్‌లో అమ్మ కోసం అయినా సొంత ఇల్లు కొనాలని, ఈ ఏడాదిలో కనీసం అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు తీసుకోవాలన్నది తన లక్ష్యమని సుప్రీత వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!