

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో మరో కీలకమైన ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన 50వ సినిమాకు సంబంధించిన పనులను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన కరుప్పు చిత్రానికి కొనసాగింపుగా కరుప్పు 2 చేసేందుకు కూడా సూర్య సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్జే బాలాజీతో మరోసారి కలిసి పనిచేయబోతున్నారట. ప్రస్తుతం చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సీక్వెల్‌ను నిర్మించనుంది.
ఇక ప్రస్తుతం సూర్య తన 48వ, 49వ సినిమాలతో బిజీగా ఉన్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో సూర్య నుంచి 2 సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఒకవైపు కొత్త కథలు, మరోవైపు విజయవంతమైన సినిమాలకు కొనసాగింపులు చేస్తూ తన అభిమానులను అలరించేందుకు సూర్య సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!