11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

Writer: Chandrika 08:37 AM, 11 ఆగస్టు, 2026
తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌, తారా సుతారియా, హుమా ఖురేషి హీరోయిన్స్‌గా, నయనతార మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్‌’. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే యూఎస్‌ మార్కెట్‌లో ప్రీమియర్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం కాగా, అక్కడ తెలుగు వర్షన్‌ హవా చూపిస్తున్నట్లు సమాచారం. కన్నడ, తెలుగు భాషల్లో బుకింగ్స్‌ అందుబాటులోకి రాగా, ప్రస్తుతానికి తెలుగు వర్షన్‌ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర భాషలతో పోలిస్తే తెలుగు ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి గణనీయంగా ఉండటం చిత్రబృందానికి సానుకూల అంశంగా మారింది. ఇప్పటికే యష్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పడటంతో ఈ బుకింగ్స్‌ ట్రెండ్‌ ఆసక్తిని పెంచుతోంది.

చిత్రానికి రవి బసృర్‌ సంగీతం అందిస్తున్నారు. యష్‌, కే వి ఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, యాక్షన్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా ప్రీమియర్స్‌కు స్పందన పెరుగుతున్న నేపథ్యంలో విడుదలకు ముందే సినిమా వసూళ్లపై చర్చ మొదలైంది. ప్రస్తుతం తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో కనిపిస్తున్న ఆధిపత్యం కొనసాగితే ప్రారంభ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తుది బుకింగ్స్‌ పూర్తయ్యే సమయానికి ఏ భాషా వర్షన్‌ అత్యధిక వసూళ్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 26న ‘టాక్సిక్‌’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

ట్యాగ్లు
టాక్సిక్‌యష్‌టాక్సిక్‌ సినిమాకియారా అద్వానీరుక్మిణి వసంత్‌గీతూ మోహన్‌దాస్‌రవి బసృర్‌నయనతారకేవీఎన్‌ ప్రొడక్షన్స్‌పాన్‌ ఇండియా సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?
సినిమాలు

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

రజినీకాంత్‌ ధర్మన్‌ షూటింగ్‌కు రంగం సిద్ధం?
గాసిప్స్

రజినీకాంత్‌ ధర్మన్‌ షూటింగ్‌కు రంగం సిద్ధం?

అజిత్‌తో శంకర్‌ సినిమా?
గాసిప్స్

అజిత్‌తో శంకర్‌ సినిమా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌
సినిమాలు

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..
క్రీడలు

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..
జనరల్

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత
జనరల్

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌
జనరల్

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌
రాజకీయాలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!