
సినిమాలు

నటి నివేదా పేతురాజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కెరీర్‌పై పూర్తి దృష్టి సారిస్తూ వరుస అవకాశాలను అందుకుంటోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ చిత్రంలో ఆమె భాగమైనట్లు వచ్చిన వార్తలకు అధికారికంగా తెరపడింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇటీవల పొల్లాచిలో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం, నివేదా పేతురాజ్ పుట్టినరోజు సందర్భంగా సెట్స్‌లో కేక్ కట్ చేసి ఆమెతో కలిసి ప్రత్యేక వేడుకలు నిర్వహించింది. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆమె ఈ చిత్రంలో నటిస్తున్న విషయం అధికారికంగా ఖరారైంది. దీంతో నివేదా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ మెగా అవకాశం కీలక మలుపు అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!