Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీటీడీ పరకామణి కేసు ... పోలీసుల పై క్రిమినల్ చర్యలకు హైకోర్టు కీలక ఆదేశాలు

02:17 PM, 6 జనవరి, 2026
టీటీడీ పరకామణి కేసు ... పోలీసుల పై క్రిమినల్ చర్యలకు హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన టీటీడీ పరకామణి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది పోలీసు అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు స్పష్టంగా ఆదేశించింది.

ఈ కేసు దర్యాప్తును వేగవంతంగా కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ అధికారులకు ధర్మాసనం సూచించింది. విచారణ సందర్భంగా, నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ సమర్పించిన నివేదికలో వెల్లడైన అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో, సంబంధిత పోలీసుల పై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది.

చోరీ ఘటనకు సంబంధించిన అంశాలను మినహాయించి, దర్యాప్తులో బయటపడిన ఇతర అంశాల పై సీఐడీ, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. అలాగే, పరకామణి కౌంటింగ్ ప్రక్రియ పై అవసరమైన సూచనలు ఇవ్వాలని కూడా కోర్టు పేర్కొంది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ లక్ష్మీ రెడ్డిలను ఇప్పటికే వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాల నేపథ్యంలో, వీరి పై సీఐడీ క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

అదే విధంగా, పత్రాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌ పై కూడా కేసు నమోదు అవుతుందా అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం పై తదుపరి విచారణను ఈ నెల 8 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

ట్యాగ్లు
టీటీడీ పరకామణి కేసుహైకోర్టు ఆదేశాలుపోలీసుల పై క్రిమినల్ కేసులుసీఐడీ దర్యాప్తుఏసీబీ విచారణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!