

ఇటీవలి కాలంలో సినిమాల రిలీజ్ డేట్లపై ఓటీటీ ఒప్పందాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ‘ఇరుముడి’ విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 26న ‘టాక్సిక్’ సినిమా విడుదల కానుండటంతో పోటీని దృష్టిలో పెట్టుకుని ‘ఇరుముడి’ని వారం రోజులు వాయిదా వేయాలని నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ భావించినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ‘ఇరుముడి’ని ఆగస్టు 21నే థియేటర్లలో విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు అదే తేదీకి సినిమాను విడుదల చేశారు.
అనూహ్యంగా నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం చివరికి ‘ఇరుముడి’కి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, ఆ తర్వాత విడుదలైన ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపించింది. ఒకవేళ ‘ఇరుముడి’ వారం రోజులు వాయిదా పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదనే చర్చ కూడా మొదలైంది.
ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లతో కొనసాగుతున్న ‘ఇరుముడి’ త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వినాయక చవితి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!