
క్రీడలు

నెట్‌ఫ్లిక్స్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది ఈస్ట్ ప్యాలెస్’ జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుండటం భారతీయ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. చారిత్రక నేపథ్యానికి అతీంద్రియ రహస్యాలను జోడించి రూపొందించిన ఈ సిరీస్ ఇప్పటికే కే-డ్రామా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. అద్భుతమైన విజువల్స్, రాజభవనం నేపథ్యంలో సాగే మిస్టరీ, ఉత్కంఠభరిత కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల డబ్బింగ్, సబ్‌టైటిల్స్‌తో ఈ సిరీస్ మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. విడుదల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెలలో అత్యంత ఆసక్తికరమైన అంతర్జాతీయ విడుదలల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!