

కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మకుటం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంలో మగుడం పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో దుశరా విజయన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే విశాల్ దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేశారు.
అయితే మకుటం సినిమాకు తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో సినిమా త్వరగానే థియేటర్ల నుంచి తప్పుకుంది. తాజాగా ఈ చిత్రానికి ఓటీటీ డీల్ కుదరడంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విశాల్, ఆర్‌బీ చౌదరి నిర్మాణ సంస్థలు నిర్మించాయి. థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!