

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని ప్రధానంగా ఆవిష్కరించే కథతో ‘నాన్నకుట్టి’ చిత్రం తెరకెక్కుతోంది. మారన్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఇతర ప్రచార అప్‌డేట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా విడుదలైన తొలి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇలా థియేటర్లలో విడుదలకు ముందే సినిమాపై సానుకూల అంచనాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘నాన్నకుట్టి’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి ప్రత్యేక చిత్రంగా నవంబర్ 6న ‘నాన్నకుట్టి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల మధ్య భావోద్వేగ బంధాన్ని ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. గ్లింప్స్, పాటకు వచ్చిన స్పందనతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను దక్కించుకోవడం సినిమాకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌గా నిలిచింది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!