
జనరల్

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో ‘పెద్ది’ హవా కొనసాగుతుండగా, జూన్ 12న విడుదల కానున్న చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ‘సింగ్ గీతం’, ‘భారత భాగ్య విధాత’, ‘పోలీస్ కంప్లైంట్’, ‘కొత్త మలుపు’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటితో పాటు మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం భారీ స్థాయిలో కంటెంట్ అందుబాటులోకి రానుంది. సూర్య నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’)తో పాటు ‘భూత్ బంగ్లా’, ‘రమణి కల్యాణం’ వంటి చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. మొత్తం 21 సినిమాలు, సిరీస్‌లు ఈ వారాంతంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!