
జనరల్

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సమావేశాల తేదీలు, అజెండాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన), రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై చర్చించి, తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!