

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డిపై ఆస్తులు, ఫార్మా కంపెనీలకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హైదరాబాద్ క్రైమ్ డీసీపీ చైతన్యకుమార్కు ఫిర్యాదు చేశారు. నైమిషా రెడ్డికి చెందినవిగా పేర్కొంటూ కొన్ని ఆస్తులు, ఫార్మా కంపెనీలపై ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు.
ఆరోపణలు తప్పుడు, కల్పిత, తప్పుదారి పట్టించే లేదా ఆధారాలు లేనివిగా తేలితే వాటికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెట్టు సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, తప్పుడు సమాచారాన్ని సృష్టించిన లేదా ప్రచారం చేసిన వారిపై సమగ్రంగా విచారణ జరపాలని కోరారు. నేరం రుజువైతే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!