

విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల ట్రూ-అప్ చార్జీల భారాన్ని మోపుతూ, ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పించుకున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు సబ్‌స్టేషన్ల ముందు, రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గడం, బొగ్గు కొరత, రాష్ట్ర విద్యుత్ అవసరాలను పట్టించుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్వహణ లోపాలే కారణమని హరీశ్‌రావు అన్నారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, సింగరేణి వ్యవహారాలు, విద్యుత్ సంస్థలపై ప్రతిపాదిత సంస్కరణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లో వోల్టేజ్, విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తక్షణమే విద్యుత్ కోతలు లేకుండా చూడటంతో పాటు రూ.5,420 కోట్ల ట్రూ-అప్ చార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!