
షోస్

తిరుపతిలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. తాము ఏర్పాటు చేయబోయే పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో మూడో స్థానంలో ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపైనా ఆయన స్పందించారు. లడ్డూలో కల్తీ జరిగిన విషయం వాస్తవమేనని, అయితే అందులో జంతు కొవ్వు లేదని అన్నారు. గత ప్రభుత్వం కిలో నెయ్యిని రూ.320 నుంచి రూ.400 వరకు కొనుగోలు చేసిందని తెలిపారు. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యి ధర కిలోకు రూ.1,000కుపైగా ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!