1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

Writer: Harika S 02:59 PM, 1 సెప్టెంబర్, 2026
ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

ఓటీటీ విడుదల తేదీ: 28 ఆగస్టు 2026

ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో

నటీనటులు: నిమిష సజయన్, బరున్ సోబ్తీ, అన్షుమన్ పుష్కర్, రాజేశ్ కుమార్, సునీత రజ్వర్ తదితరులు

దర్శకుడు: అంబికా పండిత్

నిర్మాతలు: సౌరభ్ మల్హోత్రా, మనోజ్ మిత్ర, టీనా దర్వాణి

సంగీత దర్శకుడు: అజయ్ జయంతి

సినిమాటోగ్రాఫర్: సునీల్ రామకృష్ణ బార్కర్

ఎడిటర్: తాన్యా ఛబ్రియా

కథ:
బబితా సింగ్ అలియాస్ బేబి మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటుంది. ఒక రోజు తన స్వగ్రామానికి వచ్చిన ఆమెకు చిన్ననాటి స్నేహితుడు బన్సి సింగ్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలుస్తుంది. తొలుత సాధారణ మరణంగా భావించిన ఈ ఘటన క్రమంగా హత్యగా తేలుతుంది. స్థానిక పోలీసులు, భర్త, కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో బబితానే స్వయంగా కేసును దర్యాప్తు చేస్తుంది. చివరకు ఆమె ఈ హత్య మిస్టరీని ఎలా ఛేదించిందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్లు:
ఈ సినిమాకు నిమిష సజయన్ నటన ప్రధాన బలంగా నిలుస్తుంది. పాత్రకు తగ్గట్టుగా ఆమె తన హావభావాలు, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది. పాత్ర కోసం ఆమె బరువు పెరిగిన తీరు కూడా అభినందనీయం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. బరున్ సోబ్తీ తన పరిమిత స్క్రీన్ టైమ్‌లో మంచి నటనను కనబరిచాడు. అన్షుమన్ పుష్కర్, సునీత రజ్వర్, రాజేశ్ కుమార్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కేవలం హత్య దర్యాప్తుకే పరిమితం కాకుండా బబితా వ్యక్తిగత జీవితం, బాడీ షేమింగ్, కుటుంబ పరిస్థితులు, సిస్టమ్‌తో ఆమె ఎదుర్కొనే సమస్యలను చూపించిన విధానం కూడా బాగుంది.

మైనస్ పాయింట్లు:
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కొన్ని చోట్ల రొటీన్‌గా అనిపిస్తాయి. ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఎక్కువగా చూసే ప్రేక్షకులకు కథలోని కొన్ని విషయాలు ముందుగానే అర్థమయ్యే అవకాశం ఉంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని రిపీటెడ్ సీన్స్ కథ వేగాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ను చాలా సింపుల్‌గా ముగించడం నిరాశ కలిగిస్తుంది. హత్య కేసులో పెద్ద ట్విస్ట్ లేదా బలమైన రివీల్ ఉంటుందని ఆశించే ప్రేక్షకులకు ఈ ముగింపు అంతగా సంతృప్తిని ఇవ్వదు. ఇన్వెస్టిగేషన్‌లో చెప్పుకోదగ్గ ట్విస్టులు లేకపోవడం, సినిమా హిందీ ఆడియోకే పరిమితం కావడం కూడా మైనస్‌లుగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:
సునీల్ రామకృష్ణ బార్కర్ సినిమాటోగ్రఫీ, అజయ్ జయంతి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కథ, పాత్రలను సహజంగా చూపించేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. అయితే దాదాపు రెండున్నర గంటల రన్‌టైమ్ కొంత ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. దర్శకురాలు అంబికా పండిత్ డ్రామాను అతిగా చూపించకుండా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీతో పాటు బబితా వ్యక్తిగత జీవితాన్ని, ఆమె ఎదుర్కొనే బాడీ షేమింగ్, కుటుంబ ఒత్తిడి, భర్త నుంచి ఆశించినంత ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలను చక్కగా చూపించారు.

తీర్పు:
మొత్తంగా ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ సాలిడ్ ట్విస్టుల కంటే పాత్రలు, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై ఆధారపడి సాగే క్రైమ్ డ్రామా. నిమిష సజయన్ అద్భుతమైన నటనతో సినిమాను ముందుకు నడిపిస్తుంది. అయితే రొటీన్ ఇన్వెస్టిగేషన్, కొన్ని రిపీటెడ్ సీన్స్, సింపుల్ క్లైమాక్స్ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. క్రైమ్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.

రేటింగ్: 2.5/5

రేటింగ్:

2.5/5

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?

ట్యాగ్లు
బబితా సింగ్ రిపోర్టింగ్నిమిష సజయన్బరున్ సోబ్తీఅంబికా పండిత్అమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ రివ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఓటీటీ సమీక్ష: ‘నందిని’..ఈ రొమాంటిక్ కథ ఎలా ఉందంటే?

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!
జనరల్

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...
క్రీడలు

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

CJP నిరసన పిలుపు విరమణ.. విద్యార్థులకు ఊరటపై కేంద్రం కీలక ప్రతిపాదన

జర్మనీ రైలులో భారతీయుల హంగామా
జనరల్

జర్మనీ రైలులో భారతీయుల హంగామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!