

విడుదల తేదీ: జూలై 17, 2026
నటీనటులు: జగపతి బాబు, లయ, హ్రితిక శ్రీనివాస్, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ తదితరులు
దర్శకుడు: ఆకెళ్ల వి. కృష్ణ
నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరు మామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్
సంగీత దర్శకుడు: కార్తిక్ బి. కొడకండ్ల
సినిమాటోగ్రాఫర్: చోటా కె. నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
కథ:
మధ్యప్రదేశ్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న యోగి సిద్ధార్థ్ తన భార్య ప్రియ, పిల్లలతో సంతోషకరమైన జీవితం గడుపుతుంటాడు. ఓ ప్రమాదం తర్వాత అముద అనే యువతి అతని జీవితంలోకి రావడంతో వారి కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. అసలు అముద ఎవరు? ఆమెకు నివాస్‌తో ఉన్న సంబంధం ఏమిటి? ఆమె రాకతో జరిగిన సంఘటనలే కథ.
ప్లస్ పాయింట్లు:
హ్రితిక శ్రీనివాస్ ఈ చిత్రంలో అత్యుత్తమ నటన కనబరిచింది. మానసికంగా కలత చెందిన యువతి పాత్రను ఎంతో సహజంగా పోషించింది. జగపతి బాబు ప్రేమగల భర్త, తండ్రి పాత్రలో ఆకట్టుకోగా, లయ క్లైమాక్స్‌లో భావోద్వేగ నటనతో మెప్పించింది. శ్రీనివాస్ అవసరాల, రవి వర్మతో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్లు:
కథలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానిని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. జగపతి బాబు, హ్రితిక మధ్య సన్నివేశాలు సహజంగా అనిపించవు. కథనం నెమ్మదిగా సాగడంతో పాటు అనేక సందర్భాల్లో లాజిక్ లోపిస్తుంది. భావోద్వేగాలు కూడా ప్రేక్షకుడికి బలంగా కనెక్ట్ కావు. క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపదు.
సాంకేతిక విభాగం:
నిర్మాణ విలువలు బాగున్నాయి. కార్తిక్ బి. కొడకండ్ల సంగీతం, చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపించినా, ఆకెళ్ల వి. కృష్ణ కథను ప్రభావవంతంగా తెరకెక్కించడంలో పూర్తిగా విజయవంతం కాలేకపోయారు.
తీర్పు:
వదలా సినిమాలో మంచి కాన్సెప్ట్, హ్రితిక శ్రీనివాస్, జగపతి బాబు, లయ నటన ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం, నెమ్మదైన నేరేషన్ కారణంగా ఇది ఆకట్టుకునే సైకాలజికల్ థ్రిల్లర్‌గా నిలవలేకపోయింది.













కామెంట్స్ (1)
Very good to see Laya garu after long time must be come back with any other commercial movie..👍