

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. షో ఐదో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా పలు రౌండ్లలో గుమ్మడికాయ టాస్క్ నిర్వహించారు. ఇద్దరు కంటెస్టెంట్లలో గుమ్మడికాయను గుర్తించిన విజేతకు ఇద్దరిని, ఓడిన కంటెస్టెంట్‌కు ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఇమ్యూనిటీ సాధించిన సుధీర్, కెప్టెన్ అయిన వర్షిణిని నామినేట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.
తొలి రౌండ్‌లో వర్షిణి గుమ్మడికాయను దాచగా.. రామ్ ప్రసాద్, ముకేశ్ దాని కోసం వెతికారు. రామ్ ప్రసాద్ విజేతగా నిలిచి అమన్, త్రిగుణ్‌లను నామినేట్ చేశాడు. గతవారం డాగర్ టాస్క్‌లో త్రిగుణ్ మెడ పట్టుకోలేదని చెప్పి.. వీడియోలో మాత్రం పట్టుకున్నట్లు కనిపించిందని అమన్‌పై రామ్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అనంతరం రోహిత్ విషయంలో త్రిగుణ్ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదంటూ అతడిని నామినేట్ చేశాడు. దీనిపై త్రిగుణ్ రోహిత్‌కు క్షమాపణ చెప్పగా.. రోహిత్ మాత్రం తాను క్షమించలేనని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు ముకేశ్.. కెప్టెన్సీ సమయంలో అపూర్వ ప్రవర్తన తనకు నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. త్రిగుణ్ గుమ్మడికాయ టాస్క్‌లో గెలిచిన తర్వాత అపూర్వను నామినేట్ చేశాడు. ఆమె తనను రెచ్చగొట్టిందని, బిగ్‌బాస్ నిబంధనలను ఉల్లంఘించిందని, హౌస్‌లోని విషయాలను బయటకు.. బయట విషయాలను హౌస్‌లోకి తీసుకురావడం తనకు నచ్చలేదని కారణాలు చెప్పాడు. అనంతరం అమన్‌ను కూడా నామినేట్ చేశాడు.
అమన్.. ఒకరిని ప్రోత్సహించే క్రమంలో మరొకరిని కించపరిచారని, ‘బచ్చాగాడు’ అంటూ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ ముకేశ్‌ను నామినేట్ చేశాడు. ఇక నరేశ్ గుమ్మడికాయ దాచగా.. షాలినీ, వర్షిణి వెతికారు. వర్షిణి విజేతగా నిలిచి అపూర్వ, రోహిత్‌లను నామినేట్ చేసింది. షాలినీ కూడా త్రిగుణ్‌ను నామినేట్ చేస్తూ.. అతడు మాటలు జారుతూ, డామినేషన్‌కు పాల్పడుతున్నాడని పేర్కొంది.
దీంతో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొత్తం హాట్‌హాట్‌గా సాగింది. పాత వివాదాలను కంటెస్టెంట్లు మరోసారి ప్రస్తావించడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే త్రిగుణ్-రోహిత్, ముకేశ్-అపూర్వ మధ్య మాటల యుద్ధం జరగగా.. తదుపరి ఎపిసోడ్‌లో రోహిత్, సుధీర్ మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకోనున్నట్లు ప్రోమోలో చూపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!