

బిగ్‌బాస్ తెలుగు 10లో 75వ రోజు ఆసక్తికరమైన కెప్టెన్సీ పోటీతో పాటు భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు టాస్క్ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనేందుకు నలుగురు కంటెస్టెంట్లకు అవకాశం కల్పించారు. త్రిగుణ్ టీమ్ నుంచి అమన్, దేబ్జానీ, శివకుమార్‌కు అవకాశం దక్కింది. గత టాస్కుల్లో వెనుకబడిన ముకేశ్ టీమ్ నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడంతో ముకేశ్, నీతూ, ఆర్కే పోటీ పడ్డారు. ఈ పోటీలో నీతూ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్‌గా అర్హత సాధించింది. దీంతో నీతూతో పాటు అమన్, దేబ్జానీ, శివకుమార్ తుది కెప్టెన్సీ పోటీలో నిలిచారు.
తుది కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్లకు కేటాయించిన బ్లాకులను వేగంగా నిలబెట్టి, ఆ తర్వాత వాటిని పడగొట్టాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్‌ను ముందుగా పూర్తి చేసినవారే విజేతగా నిలుస్తారు. ఈ పోటీలో అమన్ తన ప్రతిభను చూపించి విజయం సాధించారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా అవతరించారు. కెప్టెన్సీతో పాటు ఆయనకు అల్టిమేట్ పవర్ కూడా లభించింది. ఈ పవర్ ద్వారా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో పోటీ పడే కంటెండర్‌గా అవకాశం దక్కించుకోవచ్చు. దీంతో అమన్‌కు ఈ విజయం మరింత కీలకంగా మారింది.
మరోవైపు హౌస్‌లో ఆహారం విషయంలో జరిగిన పరిణామం భావోద్వేగానికి దారితీసింది. టాస్కుల్లో ముందంజలో ఉన్న త్రిగుణ్ టీమ్‌కు బిగ్‌బాస్ బిర్యానీ, భోజనం పంపించగా, ఓడిపోయిన ముకేశ్ టీమ్ సభ్యులకు గంజి మాత్రమే ఇచ్చారు. ముకేశ్ టీమ్‌లో ఉన్న నరేష్ గంజి తినడం చూసి రామ్ ప్రసాద్ తట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని త్రిగుణ్‌తో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా బయట తాము ఎలా భోజనం చేస్తారో గుర్తుచేసుకుంటూ, నరేష్ అలా గంజి తింటుంటే చూడలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన ఎపిసోడ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!