

బిగ్‌బాస్ సీజన్ 10 తెలుగు 75వ రోజు ప్రోమో 2 విడుదలైంది. ఈ ప్రోమోలో ముకేశ్ టీమ్‌కు బిగ్‌బాస్ మరో అవకాశం ఇచ్చినట్లు చూపించారు. కంటెండర్‌షిప్ కోసం పోటీ పడేందుకు టీమ్‌కు మరో ఛాన్స్ కల్పించారు. ఈ టాస్క్‌లో విజయం సాధించిన వారికి కంటెండర్‌గా నిలిచే అవకాశం దక్కనుంది. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ముకేశ్ తన టీమ్ నుంచి రామకృష్ణ, ముకేశ్, నీతూ మాస్టర్‌లను ఎంపిక చేసుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య జరగబోయే పోటీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక బిగ్‌బాస్ ఈ ముగ్గురికి ‘స్టడీ అండ్ బ్యాలెన్స్’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. కంటెండర్‌షిప్ కోసం ముగ్గురూ పోటీపడుతున్న సమయంలో ప్రోమోలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ టాస్క్‌లో ముకేశ్ మొదటగా ఆట నుంచి బయటకు వచ్చినట్లు చూపించారు. అక్కడితో ప్రోమో ముగియడంతో అసలు టాస్క్‌లో ఎవరు విజయం సాధిస్తారు? కంటెండర్‌షిప్ అవకాశం ఎవరికి దక్కుతుంది? అనే ఉత్కంఠ నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!