

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. 75వ రోజు తొలి ప్రోమోలో అమన్, రామ్ ప్రసాద్ మధ్య ఆసక్తికరమైన టాస్క్ కనిపించింది. ఇందులో భారీ బరువులను మోస్తూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌కు సంచాలక్‌గా వ్యవహరించిన ముకేశ్ నిర్ణయం తీసుకునే విషయంలో కొంత తడబడినట్లు ప్రోమోలో కనిపించింది. దీంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకుని సూచనలు ఇవ్వగా.. చివరకు అమన్‌ను విజేతగా ప్రకటించారు. అనంతరం వంటగది బాధ్యతలను టీమ్ త్రిగుణ్ కు అప్పగించారు. అంతేకాదు, ఆ టీమ్‌కు మాత్రమే భోజనం అందిస్తామని, టాస్క్‌లో ఓడిపోయిన టీమ్ ముకేశ్‌కు ఆహారం ఉండదని బిగ్‌బాస్ ప్రకటించారు.
ఈ ప్రకటనతో హౌస్‌లో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి. మరోవైపు సుధీర్, రామ్ ప్రసాద్ కలిసి ముకేశ్ గురించి ఏదో మాట్లాడుకుంటున్న దృశ్యాలు ప్రోమోలో కనిపించాయి. చివర్లో నరేశ్‌ను తలచుకుంటూ రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకోవడం భావోద్వేగానికి గురిచేసింది. టాస్క్ ఫలితం, భోజనంపై ఆంక్షలు, హౌస్మేట్స్ మధ్య చర్చలు, రామ్ ప్రసాద్ భావోద్వేగాలు తాజా ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!