

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నుంచి రోహిత్ అనూహ్యంగా ఎలిమినేట్ కావడం ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. అతడు ఎలిమినేట్ అయ్యాడనే వార్తలు వచ్చినప్పుడు చాలామంది నమ్మలేదు. సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి తిరిగి హౌస్‌లోకి వస్తాడని భావించారు. అయితే, ఇంటి సభ్యుల ఓట్ల ఆధారంగా రోహిత్‌ను నేరుగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. టాప్ 5లో చోటు దక్కించుకుంటాడని భావించిన కంటెస్టెంట్ ఇలా బయటకు వెళ్లడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై రోహిత్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అతడిని తిరిగి హౌస్‌లోకి తీసుకురావాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన రోహిత్.. ప్రారంభంలో టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ, తన అభిప్రాయాలను నేరుగా చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే, రోజులు గడిచేకొద్దీ అతడి ఆటతీరులో మార్పు వచ్చిందని, టాస్కుల్లో నిలకడ లేకపోవడం, తోటి కంటెస్టెంట్లతో గొడవలు, అతిగా ప్రవర్తించడం, త్రిగుణ్‌తో విభేదాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వంటి అంశాలు ఎలిమినేషన్‌కు కారణాలుగా చర్చకు వస్తున్నాయి. మరోవైపు, రోహిత్‌కు వారానికి రూ.70 వేల చొప్పున ఎనిమిది వారాలకు రూ.5.60 లక్షలు అందినట్లు, అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకు అదనంగా రూ.50 వేలు కలిపి మొత్తం రూ.6.10 లక్షలు సంపాదించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పారితోషిక వివరాలకు అధికారిక నిర్ధారణ లేదు. ఎలిమినేషన్ సమయంలో అతడి జర్నీ వీడియోను చూపించకపోవడం కూడా అభిమానుల్లో అనుమానాలకు తావిచ్చింది. దీంతో రోహిత్ మళ్లీ హౌస్‌లోకి వస్తాడనే ఆశాభావాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!