

బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదో వారం నామినేషన్లు హీటెక్కాయి. సోమవారం ప్రారంభమైన ‘రోడ్ టు రోలర్’ టాస్క్‌లో భాగంగా నామినేషన్లు సాగగా.. ఓ ఆపిల్ కోసం మొదలైన పోటీ ఇంట్లో వాతావరణాన్ని మార్చేసింది. షాలినిని ఓడించి ఆపిల్‌ను దక్కించుకున్న వర్షిణి.. అపూర్వను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వర్షిణి రోహిత్‌ను నామినేట్ చేస్తూ.. అతడి వల్ల తాను ఎంతో బాధపడ్డానని చెప్పింది. దీనిపై రోహిత్ కూడా ఘాటుగా స్పందించాడు.
మరోవైపు అపూర్వను ముకేశ్ నామినేట్ చేయడంతో పాటు తనదైన శైలిలో సైగలు చేస్తూ నవ్వులు పూయించాడు. అపూర్వ పవర్ గురించి త్రిగుణ్ స్మార్ట్‌గా అంచనా వేశాడని ఆమె వ్యాఖ్యానించగా.. త్రిగుణ్ ఇతరులను రెచ్చగొడుతూ గేమ్ ఆడుతున్నాడంటూ రోహిత్ ఆరోపించాడు. దీనిపై త్రిగుణ్ తీవ్రంగా స్పందిస్తూ.. పక్కవాళ్లను రెచ్చగొట్టడం తన గేమ్ కాదని, ప్రతి విషయాన్ని బట్టీ పట్టడం కాకుండా కొంత బుర్ర ఉపయోగించాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దీంతో ప్రోమోలో అపూర్వ, వర్షిణి, రోహిత్, త్రిగుణ్ మధ్య జరిగిన వాగ్వాదాలు ఆసక్తిని పెంచాయి.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!