

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో గత వారం జరిగిన సాక్ టాస్క్ మరోసారి ఇంటి సభ్యుల మధ్య నవ్వులు పూయించింది. ఈ టాస్క్‌లో వర్షిణి, నీతూ, శివ్ ప్రవర్తనను రామ్ ప్రసాద్, నరేశ్ కలిసి అనుకరిస్తూ సందడి చేశారు. ముఖ్యంగా వర్షిణి ప్రదర్శనను నరేశ్ అనుకరించగా, రామ్ ప్రసాద్ ఆ సన్నివేశాన్ని వివరిస్తూ ఆమె హావభావాలను స్పూఫ్ చేశారు. బరువులు వేయకముందే వర్షిణి స్పందించిన తీరు నుంచి, చివరకు అలసిపోయి కుప్పకూలిన సందర్భం వరకు ఇద్దరూ నటించి చూపించారు. ఈ సరదా ప్రదర్శనను చూసి ఇంటి సభ్యులు నవ్వుకున్నారు. వర్షిణి కూడా నవ్వుతూ ఆ క్షణాలను ఆస్వాదించింది.
అంతటితో ఆగకుండా నీతూ, శివ్‌ల ప్రదర్శనలను కూడా రామ్ ప్రసాద్ అనుకరించారు. సాక్ టాస్క్‌లో నీతూ ఎక్కువ బరువును తట్టుకుంటూ నిలబడిన తీరును, శివ్ బరువులు వేస్తున్నప్పుడు స్పందించిన విధానాన్ని సరదాగా చూపించారు. అసలు టాస్క్‌లో కొందరు సభ్యులు ఎక్కువ బరువును ఎక్కువసేపు మోసి ఆకట్టుకోగా, వర్షిణి తక్కువ బరువుకే ఇబ్బంది పడటంపై గతంలో నాగార్జున కూడా స్పందించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ సంఘటనలను హాస్యభరితంగా మళ్లీ చూపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!