

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తన కొత్త చిత్రం ‘బేపర్వా’ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో యువ నటుడు అహాన్ పాండే కథానాయకుడిగా, శార్వరి వాగ్ కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ కొత్త జంట తెరపై ఎలా సందడి చేయనుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో సీనియర్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఐశ్వర్య ఠాక్రే కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ‘బేపర్వా’ 2027 మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది. ప్రేమ, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!