

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తుది అంకానికి చేరుకుంటోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకోగా.. మరో నెల రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరిగే అవకాశం ఉంది. దీంతో హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ మొదలైంది. టాప్-5లో చోటు సంపాదించుకునేందుకు కంటెస్టెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ సీజన్ విజేత ఎవరు? చివరి ఐదుగురిలో ఎవరుంటారు? అనే అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రస్తుతం బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న శివాజీ తన అంచనాలను వెల్లడించారు. ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన ఆయన.. బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ల ఆటతీరుపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
శివాజీ అంచనా ప్రకారం.. ముకేశ్, త్రిగుణ్, నరేశ్, దేబ్జానీ టాప్-5లో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. అయితే ఐదో స్థానం ఎవరికి దక్కుతుందనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. జబర్దస్త్ రామ్ ప్రసాద్, అమన్ మసూద్, టెంపర్ వంశీలలో ఎవరైనా ఆ స్థానంలో నిలవొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. పదకొండో వారం ఎలిమినేషన్ కోసం త్రిగుణ్, వర్షిణి, ముకేశ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, శివ, నీతూ మాస్టర్, సుధీర్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో యాంకర్ వర్షిణి లేదా సుధీర్ ఈ వారం ఎలిమినేట్ కావచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఇద్దరూ హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!