

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 10 తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్‌తో ఆసక్తిని పెంచింది. చరణ్, చైత్ర రాయ్ హౌస్ నుంచి బయటకు రావడంతో ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై చర్చ మొదలైంది. హౌస్‌లో పోటీని మరింత పెంచేందుకు కొత్త కంటెస్టెంట్లను రంగంలోకి దింపేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ బుల్లితెర నటి కావ్యశ్రీ పేరు వినిపిస్తోంది.
కన్నడకు చెందిన కావ్యశ్రీ ‘కోయిలమ్మ’, ‘గువ్వా గోరింకా’, ‘గోరింటాకు’ వంటి తెలుగు సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ ఆఫర్‌పై స్పందించిన ఆమె.. షో టీమ్ తనను సంప్రదించిన విషయం నిజమేనని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఆఫర్‌ను అంగీకరించలేదని, బిగ్ బాస్‌లోకి వెళ్లాలా వద్దా అనేది తన కుటుంబ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!