

బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్‌లోనూ హాట్‌హాట్‌గా కొనసాగింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. సుధీర్ రెడ్డి ముందుగా రోహిత్‌ను నామినేట్ చేస్తూ అతడి యాటిట్యూడ్, ఇతరులను గౌరవించకపోవడం, హీరోలా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రశ్నించాడు. దీంతో రోహిత్ తీవ్రంగా స్పందించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం షాలినిని నామినేట్ చేసిన సుధీర్.. ఆమె నుంచి మరింత స్ట్రాంగ్ గేమ్‌ను ఆశించానని చెప్పాడు. అయితే షాలిని అతడి వ్యాఖ్యలను ఖండిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు చరణ్.. ముఖేష్ గౌడను నామినేట్ చేస్తూ హౌస్‌లో స్టార్, కామనర్ అనే తేడా ఉండకూడదని వ్యాఖ్యానించాడు. అపూర్వ కూడా ముఖేష్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక అపూర్వ సింగర్ ఝాన్సీని కూడా నామినేట్ చేయగా, జబర్దస్త్ నరేష్.. చరణ్ గేమ్‌ను ప్రశ్నిస్తూ అతడిని నామినేట్ చేశాడు. దీనికి చరణ్ కూడా ఘాటుగా స్పందించాడు. అనంతరం ఝాన్సీ రోహిత్‌ను నామినేట్ చేయగా, రోహిత్ ఆమె తన ఆటను విమర్శించే ముందు తన గేమ్‌ను చూసుకోవాలని కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత అమన్‌ను నామినేట్ చేసిన ఝాన్సీ.. అతడు చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో ఇతర కంటెస్టెంట్లు జోక్యం చేసుకుని వారిని ఆపారు. మంగళవారం ఎపిసోడ్ ముగిసే సమయానికి అమన్, అపూర్వ, ముఖేష్ గౌడ, రోహిత్, సింగర్ ఝాన్సీ, చరణ్, నరేష్, షాలిని, రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఐదో వారం ఎలిమినేషన్ రేసులో నిలిచారు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!