

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు సామాన్యులకు ‘అగ్ని పరీక్ష’ కాంటెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సెలబ్రిటీలకు కూడా పలు రకాల పరీక్షలు ఉంటాయని మాజీ కంటెస్టెంట్, నటి దివి వెల్లడించారు. తాజాగా ఓ ఛాట్ షోలో పాల్గొన్న ఆమె.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో తన అనుభవంతో పాటు షోలోకి ఎంట్రీకి ముందు జరిగే ఎంపిక ప్రక్రియ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదట ఫొటోలు పరిశీలించి, ఆ తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.
వీడియో కాల్ ద్వారా ఒకేసారి పలువురు మాట్లాడటంతో పాటు, ప్రత్యేకంగా వైద్యులు కూడా అభ్యర్థులతో మాట్లాడతారని దివి చెప్పారు. మానసిక స్థితిని అంచనా వేయడంతో పాటు శారీరక ఆరోగ్య పరీక్షలు, బీపీ, షుగర్ వంటి అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. హౌస్‌లో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు, గొడవలకు దారితీసే అవకాశం ఉందా, ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉందా వంటి అంశాలను కూడా ముందుగానే అంచనా వేస్తారని చెప్పారు. ఈ పరీక్షలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాతే సెలబ్రిటీలకు హౌస్‌లోకి ప్రవేశం లభిస్తుందని దివి వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!