
జనరల్

నటి సీరత్ కపూర్ బిగ్‌బాస్ తెలుగు షోలో పాల్గొనే అవకాశాన్ని తిరస్కరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆకర్షణీయమైన పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పటికీ ఆమె ఈ ప్రతిపాదనకు సున్నితంగా నో చెప్పినట్లు సమాచారం. షోలోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా సీరత్‌ను తీసుకురావాలని నిర్వాహకులు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం తన సినీ కెరీర్, ఇతర వృత్తిపరమైన బాధ్యతలపై దృష్టి పెట్టిన సీరత్ ఈ అవకాశాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ఆమె బిగ్‌బాస్ ఆఫర్‌ను వదులుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీరత్ ఎంట్రీతో షోలో మరింత సందడి నెలకొంటుందని అభిమానులు భావించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!