

యూఎస్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ టైటిల్ పోరులో తలపడనున్నారు. కార్లోస్ అల్కరాస్‌పై సంచలన విజయం తర్వాత అదే జోరును కొనసాగించిన షెల్టన్.. సెమీస్‌లో తన దేశానికే చెందిన ఫ్రాన్సిస్ టియాఫోను 4-6, 6-3, 6-3, 7-5తో ఓడించాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరాడు.
మరో సెమీస్‌లో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 7-6(7), 7-6(6)తో కరెన్ కచనోవ్‌పై విజయం సాధించాడు. దీంతో రెండోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 2020లో ఫైనల్‌లో ఓడిన జ్వెరెవ్.. ఈసారి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. 2026 ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా ఉన్న జ్వెరెవ్‌కు ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. షెల్టన్-జ్వెరెవ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!