
జనరల్

యూరోపియన్ టీ20 లీగ్‌లో ఓ జట్టుకు భాగస్వామిగా ఉన్న భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పాత్రపై ఆ జట్టు కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ్ జట్టులో ఓనర్‌లా వ్యవహరిస్తున్నారని, అయితే క్రికెట్‌కు సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకోరని రాథోడ్ తెలిపారు.
జట్టు నిర్వహణలో ద్రవిడ్ తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, కోచ్ బాధ్యతల్లో జోక్యం చేసుకోవడం లేదని రాథోడ్ స్పష్టం చేశారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి స్వేచ్ఛనిస్తూ జట్టు ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు మాత్రమే ద్రవిడ్ తన సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!