
జనరల్

బిమ్స్టెక్ అండర్-23 అథ్లెటిక్ మీట్లో గుంటూరుకు చెందిన అథ్లెట్ షేక్ రోషన్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. గురువారం భువనేశ్వర్లో జరిగిన 110 మీటర్ల హర్డిల్స్ పోటీలో 14.15 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తన వేగం, ప్రతిభతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ పోటీలో శ్రీలంకకు చెందిన విజయలత్ రజత పతకాన్ని సాధించగా, భారత్కు చెందిన రితిక్ రాహుల్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. గుంటూరు అథ్లెట్ షేక్ రోషన్ స్వర్ణం సాధించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి పోటీలో భారత అథ్లెట్ ప్రతిభ చాటడం విశేషంగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!